Rakhi Celebrations at Pragati Bhavan : ప్రగతిభవన్లో ఘనంగా రక్షాబంధన్ వేడుకలు - CM KCR latest information
🎬 Watch Now: Feature Video
Published : Aug 31, 2023, 7:02 PM IST
|Updated : Aug 31, 2023, 7:08 PM IST
Rakhi Celebrations at Pragati Bhavan : అన్నా-చెల్లెళ్ల బంధానికి ప్రతీక అయిన రక్షాబంధన్ వేడుకలు ప్రగతిభవన్లో ఘనంగా జరిగాయి. సీఎం కేసీఆర్కు ఆయన అక్కలు, చెల్లెళ్లు రాఖీ కట్టి ఆశీర్వదించారు. రక్షాబంధన్ సందర్భంగా ప్రేమానురాగాలు, అనుబంధాలకు ప్రగతిభవన్ వేదికగా నిలిచింది. తమ సోదరుని పట్ల తమకు ఉన్న ప్రేమను రాఖీ కట్టడం ద్వారా తెలియజేశారు. సీఎం కేసీఆర్కు రాఖీ కట్టిన వారిలో అతని అక్కలు లక్ష్మీబాయి, జయమ్మ, లలితమ్మ, చెల్లెలు వినోదమ్మ ఉన్నారు. తమ సోదరునికి రాఖీ కట్టి ఆశీర్వదించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ తన అక్కలకు పాదాభివందనాలు చేసి ఆశీర్వాదాలు తీసుకున్నారు. కార్యక్రమంలో ఆయనతో పాటు ఆయన సతీమణి శోభమ్మ పాల్గొన్నారు. ఆమెకు కూడా కేసీఆర్ అక్కలు ఆశీర్వాదాలు అందజేశారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాఖీ పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. రక్షాబంధన్ సందర్భంగా నగరంలో ఎక్కడ చూసినా పండుగ వాతావరణం కనిపించింది. చిన్నాపెద్దా అంతా ప్రశాంత వాతావరణంలో పండుగ జరుపుకున్నారు.