రెండు లారీలు ఢీ.. భారీగా చెలరేగిన మంటలు.. ముగ్గురు సజీవ దహనం - బాఢ్‌మేర్‌లో రోడ్డు ప్రమాదం
🎬 Watch Now: Feature Video
రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తున్న రెండు లారీలు పరస్పరం ఢీకొన్నాయి. దీంతో ఒక్కసారిగా రెండు వాహనాల్లో భారీగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు సజీవ దహనం అయ్యారు. మరొకరికి తీవ్రంగా కాలిన గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా.. అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ రోడ్డు ప్రమాదం బాఢ్‌మేర్ జిల్లాలోని గూడమలాని పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం వేకువజామున జరిగింది.
ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. బికానీర్ నుంచి వస్తున్న ఓ లారీ.. లోడ్‌తో ఎదురుగా వెళ్తున్న వెళ్తున్న మరో లారీని ఢీకొట్టింది. ఈ క్రమంలో లారీలో ఉన్న ఓ వ్యక్తి కిందికి దూకేశాడు. అతడికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం అతడు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. దీంతో రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. వాహనాల రాకపోకలు కాసేపు నిలిచిపోయాయి. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని.. కేసు నమోదు చేసుకున్నారు. రోడ్డు ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు దర్యాప్తు చేపట్టారు. మృతుల వివరాలు ఇంకా తెలియలేదని పోలీసులు తెలిపారు.