స్కూటీని ఢీకొట్టి రాజధాని బస్సు దగ్ధం.. ఒకరు మృతి - Rajadhani Bus Catches Fire at suryapet
🎬 Watch Now: Feature Video
Rajadhani Bus Catches Fire at suryapet: సూర్యాపేట మునగాల మండలం ఇందిరానగర్ వద్ద జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ రాజధాని బస్సు హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్తుండగా.. అకస్మాత్తుగా వచ్చిన స్కూటీ ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. అనంతరం బస్సు కిందకు దూసుకెళ్లడంతో మంటలు చెలరేగాయి. ఈ క్రమంలో అప్పటివరకు బస్సులో నిద్రమత్తులో ఉన్న జనం ఒక్కసారిగా ఉలిక్కిపడి భయబ్రాంతులకు గురయ్యారు. హుటాహుటిన అందులో ఉన్న ప్రయాణికులంతా బస్సులో నుంచి బయటకు దిగారు. అప్పటికే స్కూటీకి అంటుకున్న మంటలు బస్సుకు కూడా వ్యాపించి క్షణాల్లోనే రెండు వాహనాలు పూర్తిగా అగ్నికి ఆహుతైపోయాయి.
గాయాలపాలైన ద్విచక్రవాహనదారుడిని దగ్గరలోని ఆస్పత్రికి తరలిస్తుండగా దారిలోనే మృతి చెందాడు. ప్రమాద సమయంలో బస్సులో 10 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. బస్సు ఒక్కసారిగా కుదుపునకు గురికావడంతో అర్తనాదాలు చేస్తూ వెంటనే కిందకు దిగడంతో ప్రాణాలతో బయటపడ్డారు. ఈ సమయంలో జాతీయ రహదారిపై పెద్ద ఎత్తున ట్రాఫిక్కు అంతరాయం కలిగింది. అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపుచేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
TAGGED:
Bus Fire