జహీరాబాద్‌లో భారీ వర్షం, వాహనదారులకు ఇక్కట్లు - జహీరాబాద్‌లో భారీ వర్షం వల్ల కరెంట్ నిలిచిపోయింది
🎬 Watch Now: Feature Video
Published : Nov 8, 2023, 8:58 PM IST
Rain in Sangareddy District : సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో భారీ వర్షం పడింది. సాయంత్రం ఏకధాటిగా కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయంగా మారాయి. వర్షంతో పాటు తీవ్ర గాలి వీయడంతో చెట్లు విరిగిపడ్డాయి. పట్టణంలోని మహీంద్రా కాలనీలో చెట్లు విరిగి కరెంట్ తీగలపై పడ్డాయి. దీంతో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగింది. రోడ్లపై నిలిపివేసిన వాహనాలపై చెట్లు పడడంతో.. పలు ద్విచక్ర వాహనాలు దెబ్బతిన్నాయి.
Fell Trees Due to Rain : వాహనాలపై పడిన చెట్లను తొలగించేందుకు స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీంతో కొద్దిసేపటి వరకు ట్రాఫిక్ జామ్ అయింది. విద్యుత్ అధికారులు సరఫరా పునరుద్ధరించడం ఆలస్యం కావడంతో మహేంద్ర కాలనీ, వెంకటేశ్వర కాలనీ, రాయల్ కాలనీ, జర్నలిస్ట్ కాలనీ, పస్తాపూర్‌లో అంధకారం నెలకొంది. పంట చేతికి వచ్చే సమయానికి వర్షాలు పడుతుండటంతో రైతులు దిగులు చెందుతున్నారు. యాసంగిలాగా ఇప్పుడు కూడా వర్షాల వల్ల పంట నష్టం వాటిల్లుతుందేమోనని భయాందోళనకు గురవుతున్నారు.