చెక్డ్యాంకు గండి.. 4 గ్రామాలకు నిలిచిన రాకపోకలు - గోపాల గోశాల
🎬 Watch Now: Feature Video
గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం సమీపంలోని గోపాల గోశాల వద్ద చెక్డ్యాంకు గండిపడింది. దీంతో వరద నీరు లోతట్టు ప్రాంతాలకు చేరుతుంది. వాగుల వద్ద భారీగా వరదనీరు చూడడంతో మజీద్ పూర్ కు రాకపోకలను నిలిపివేశారు. అబ్దుల్లాపూర్ మెట్ మండలంలోని మజీద్ పూర్, గుంతపల్లి, బాటసింగారం మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. మజీద్ పూర్కు పోవాల్సి వస్తే పీర్లగూడెం మీదుగా వెళ్లాలని అధికారులు తెలిపారు.
Last Updated : Feb 3, 2023, 8:25 PM IST