అధికారంలోకి రాగానే పరిష్కరిస్తాం - ఆటో, జీహెచ్ఎంసీ, గిగ్ వర్కర్లతో రాహుల్ గాంధీ
🎬 Watch Now: Feature Video
Rahul Gandhi Interacts With Auto Drivers, GHMC Employees : తెలంగాణలో అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ నేతలు ప్రచారంలో దూసుకుపోతున్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారం చివరి రోజైన ఇవాళ కాంగ్రెస్ అగ్రనేతలు.. సభలు, కార్నర్ మీటింగ్, సమావేశాలతో బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో ఆటో వర్కర్స్ యూనియన్‌తోపాటు, జీహెచ్ఎంసీ, గిగ్ వర్కర్స్ యూనియన్లతో సమావేశమయ్యారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని పారిశుద్ధ్య కార్మికులు తమ ఆవేదనను రాహుల్ ముందు వెల్లబోసుకున్నారు. ప్రమాద బీమా కల్పించాలని విజ్ఞప్తి చేశారు. జీహెచ్ఎంసీ కాంట్రాక్టు ఉద్యోగులను వేధిస్తున్నారని కార్మికులు ఆరోపించారు. రెండు పడకల గదులు ఇళ్లు ఇస్తామని చెప్పి ఇవ్వలేదని.. కాంట్రాక్టర్లు 11 గంటలు పని చేయిస్తున్నారని వాపోయారు. పోలీసులు చలాన్లతో వేధిస్తున్నారని క్యాబ్ డ్రైవర్లు, ఆటో డ్రైవర్లు తమ ఆవేదన వ్యక్తం చేశారు. ఇవన్నీ విన్న రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధికారంలోకి రాగానే సీఎం, మంత్రులు సమావేశమై ఈ సమస్యలు పరిష్కరిస్తారనిని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమం అనంతరం ఫంక్షన్‌హాల్ నుంచి యూసుఫ్‌గూడ మెట్రో స్టేషన్ వరకు అజారుద్దీన్‌తో కలిసి ఆటోలో ప్రయాణించారు.