ములుగులో క్వారీ ప్రమాదం - జేసీబీ జారి ఇద్దరు మృతి - తెలంగాణ క్రైమ్ న్యూస్
🎬 Watch Now: Feature Video
Published : Nov 12, 2023, 9:29 PM IST
Quarry Accident in Mulugu District : ములుగు జిల్లా మహ్మద్ గౌస్పల్లి శివారులో ఉన్న ఓ క్వారీలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది జరిగింది. రఘుపతి రెడ్డి క్రషర్లో కొండపై పనిచేస్తున్న రెండు జేసీబీలు ప్రమాదవశాత్తు 150 మీటర్ల ఎత్తు నుంచి కిందపడ్డాయి. అందులో పనిచేస్తున్న జేసీబీ ఆపరేటర్లు ఇద్దరూ.. అక్కడికక్కడే మృతి చెందారు. కొండపై ప్రొక్లెయిన్ పనిచేస్తుండగా.. దానికింద ఉన్న పెద్ద పెద్ద బండరాళ్లు కదిలి.. జేసీబీ ముందుకు పడిపోయినట్లు స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
JCB Operators Accidental Death in Mulugu : మృతుల్లో ఒకరు బిహార్ రాష్ట్రానికి చెందిన బాక్సర్ పరమేశ్వర్ యాదవ్ కాగా మరో వ్యక్తి ఒడిశా రాష్ట్రంలోని రాయగఢ్ జిల్లాకు చెందిన జక్త్ మజీ ఇద్దరు ఆపరేటర్లు మృతి చెందారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని.. మరో జేసీబీ సహాయంతో బండరాళ్లు తొలగించి మృతదేహాలను వెలికితీశారు. ప్రమాదంపై సమగ్ర విచారణకై దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.