Protests Against Chandrababu Arrest in Khammam : చంద్రబాబు అరెస్ట్‌కు నిరసనగా సత్తుపల్లిలో భారీ బైక్ ర్యాలీ - Khammam district latest news
🎬 Watch Now: Feature Video
Published : Sep 15, 2023, 9:27 PM IST
Protests Against Chandrababu Arrest in Khammam : ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరెస్టును వ్యతిరేకిస్తూ.. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో చంద్రబాబు అభిమానులు, టీడీపీ కార్యకర్తలు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. నల్ల జెండాలతో తమ నిరసన వ్యక్తం చేస్తూ.. చంద్రబాబు అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై ర్యాలీలో పాల్గొన్నారు.
Bike Rally in Khammam : సత్తుపల్లి పట్టణ శివారు నుంచి రింగ్ సెంటర్ వరకు.. భారీ ద్విచక్ర వాహనాల ర్యాలీ తీశారు. చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ ఆందోళన చేపట్టారు. అనంతరం ఎన్టీఆర్ విగ్రహం వద్ద నల్ల జెండాలతో నిరసన వ్యక్తం చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు చేసిన సేవలను కొనియాడుతూ.. కక్షపూరితంగా అక్రమ కేసులో అరెస్టు చేయడం సరికాదన్నారు. రాజ్యాంగ నియమాలను కాలరాస్తూ.. ఉద్దేశపూర్వకంగానే రాజకీయ కక్షతో చేయని నేరానికి చంద్రబాబును అరెస్ట్ చేశారని దుయ్యబట్టారు. తక్షణమే చంద్రబాబును విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.