Protest in Kuwait Against Chandrababu Arrest : చంద్రబాబు అక్రమ అరెస్టును ఖండిస్తూ.. కువైట్‌లో వినూత్న నిరసన - nri protest in kuwait against cbn arrest
🎬 Watch Now: Feature Video
Published : Sep 30, 2023, 8:04 PM IST
Protest in Kuwait Against Chandrababu Arrest : చంద్రబాబు అక్రమ అరెస్టును ఖండిస్తూ ఎన్నారై తెలుగుదేశం కువైట్, జనసేన కువైట్ సంయుక్త ఆధ్వర్యంలో తలకు నల్ల రిబ్బన్లు కట్టుకుని నిరసన తెలిపారు. కువైట్లోని ఫర్వానియా ప్రాంతంలో జరిగిన ఈ కార్యక్రమానికి తెలుగుదేశం, జనసేన నాయకులు, జన సైనికులు పెద్ద ఎత్తున హాజరై సంఘీభావం తెలిపారు. చంద్రబాబును వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ఈ నిరసన కార్యక్రమంలో ఎన్నారై టీడీపీ నాయకులు సుధాకర రావు కుదరవల్లి, నాగేంద్రబాబు అక్కిలి, మద్దిన ఈశ్వర్ నాయుడు, వీసీ సుబ్బారెడ్డి, షేక్ బాషా, దుగ్గి శ్రీను, గాజులపల్లి సుబ్బారెడ్డి, మహేష్, సుబ్బరాజు, చామర్తి వెంకట రామరాజు, చిన్నా రాజు, నూతేటి సబ్బ నరసింహులు, రవి చంద్రారెడ్డి, చిన్న బాబు గునపాటి, రాము, మహాసేన రాజేష్ రాపాక, తదితరులు పాల్గొన్నారు.
జనసేన నాయకులు రామచంద్ర నాయక్, కాంచన శ్రీకాంత్ బాబు, అంజన్ కుమార్ పగడాల, ఓబులేసు, వెంకటేష్, దండు చంద్రశేఖర్, ప్రేమ రాయల్, కొమ్మినేని బాలాజీ, పసుపులేటి రాజేష్, శంకర్, భాస్కర్ రాయల, చైతూ పాగడల, పూల సాయి, రమేష్ తదితరులు పాల్గొన్నారు.