Protest at KTR Banswada Meeting : బాన్సువాడలో మంత్రి కేటీఆర్‌కు నిరసన సెగ - Kamareddy latest news
🎬 Watch Now: Feature Video
Published : Oct 4, 2023, 8:18 PM IST
Kaaiti Lambadis Protest at KTR Banswada Meeting : బాన్సువాడలో మంత్రి కేటీఆర్‌కు(KTR) నిరసన సెగ తగిలింది. తమను ఎస్టీ జాబితాలోకి చేర్చాలంటూ కాయితీ లంబాడీలు ఆందోళన చేపట్టారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడలో పర్యటించిన కేటీఆర్.. మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డితో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించారు. బాన్సువాడ సభలో మంత్రి కేటీఆర్ ప్రసంగిస్తుండగా.. తమ హక్కులను గుర్తించాలని లంబాడీలు ప్లకార్డులు ప్రదర్శించారు.
Lambadis Dharna at Banswada Meeting : రిజర్వేషన్లపరంగా నష్టపోతున్నామని.. తమను తక్షణమే ఎస్టీ జాబితాలో చేర్చాలంటూ నినాదాలు చేశారు. తమకు గిరిజనుల హక్కులు వర్తించేలా న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. వెంటనే పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. వారి వద్దనున్న ప్లకార్డులను లాక్కుని సభ నుంచి బయటకు పంపించారు. గత కొన్నిరోజులుగా ధర్నాలు చేస్తున్న వీరు.. ఇటీవల కామారెడ్డి కలెక్టరేట్ ముట్టడికి "ఛలో కామారెడ్డి" పేరుతో ధర్నాకు పిలుపునిచ్చారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కామారెడ్డి నియోజకవర్గం తరఫున.. పెద్ద మొత్తంలో నామినేషన్లు దాఖలు చేస్తామని హెచ్చరించారు. తాజాగా కేటీఆర్ సభలో నిరసన చేపట్టడం చర్చనీయాంశంగా మారింది.