సినీ పరిశ్రమ సమస్యలపై త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డిని కలుస్తాం : నిర్మాత దిల్ రాజు - సంక్రాంతి సినిమా రిలీజ్లపై దిల్ రాజు వ్యాఖ్యలు
🎬 Watch Now: Feature Video
Published : Dec 25, 2023, 7:25 PM IST
Producer Dil Raju Will Meet to CM Revanth Reddy : తెలుగు సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలను త్వరలోనే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విన్నవించనున్నట్లు ప్రముఖ నిర్మాత, తెలుగు ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు దిల్ రాజు తెలిపారు. ఇటీవలే సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని కలిశామని, సీఎం రేవంత్ రెడ్డిని కలిసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని ఆయన వెల్లడించారు. అలాగే సంక్రాంతి సినిమాల వివాదంపై స్పందించిన దిల్ రాజు, ఫిల్మ్ ఛాంబర్లో ఆ ఐదు చిత్రాల నిర్మాతలతో చర్చలు జరిపినట్లు తెలిపారు.
Dil Raju on Sankranti Movies Release Issue : గుంటూరు కారం నిర్మాతలు మినహా మిగతా నలుగురు నిర్మాతల్లో ఎవరో ఒకరు వెనక్కి తగ్గితే అందరికీ లాభదాయకంగా ఉంటుందని దిల్ రాజు పేర్కొన్నారు. సంక్రాంతి రేసు నుంచి తప్పుకునే చిత్ర నిర్మాతకు ఎలాంటి పోటీ లేకుండా సోలో తేదీ ఇవ్వడానికి ప్రయత్నిస్తామని వివరించారు. సంక్రాంతికి ఐదు చిత్రాలు విడుదలైతే ఏ సినిమాకూ న్యాయం జరగదన్న దిల్ రాజు, సినిమా విడుదల తేదీలపై చిత్ర పరిశ్రమ ఎప్పుడూ ఆంక్షలు పెట్టలేదన్నారు.