Prathidwani : ఒత్తిడికి పర్యాయపదంగా మారిన నేటి బట్టీ చదువులు.. విద్యార్థుల ఆత్మహత్యలు ఆపేదెలా? - Prathidwani Program
🎬 Watch Now: Feature Video
Published : Sep 21, 2023, 9:55 PM IST
Today Prathidwani Debate on Students Suicide : కోటి ఆశలతో... కొత్తబంగారు లోకంలో.. విహరించాల్సిన నవతరం ఆత్మహత్యల కలకలంతో నిత్యం వార్తల్లో నిలవడానికి కారణాలేంటి? నిరంతర ఒత్తిడితో చిత్తవుతున్న పసిమెదళ్లకు అసలైన ఉపశమనం లభించాలంటే- దేశీయంగా వడపోత విధి విధానాల్ని ఏవిధంగా సంస్కరించాలి? నిర్దేశిత మార్కులు రానివారిని అసమర్థులుగా ఛీత్కరించే బండ పరీక్షల పద్ధతిని ప్రక్షాళించి, పిల్లల నైపుణ్యాలను అభ్యసన ఆధారిత మూల్యాంకనం ద్వారా బేరీజు చేసే విధానాలను తీసుకువచ్చే సమూల మార్పులు సాధ్యమేనా? పోటీ పరీక్షల్లో పరాజయం చవిచూసిన విద్యార్థుల కోసం పార్లమెంటరీ సంఘం సూచించినట్లు- నిరంతర టెలిఫోన్ కౌన్సెలింగ్ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకురావాలి. అన్ని ఉన్నత విద్యాసంస్థలు, కోచింగ్ కేంద్రాల్లో మానసిక ఆరోగ్య నిపుణులను నియమించాలి. విద్యార్థుల వరస ఆత్మహత్యల విషయంలో అసలు లోపం ఎక్కడ ఉంది? నిందించాల్సింది ఎవర్ని? దిద్దుబాటు చేపట్టాల్సింది ఎవరు? ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో సైతం ఈ మృత్యుఘంటికలు దేనికి సంకేతం? కొద్దిరోజులుగా అందర్నీ వేధిస్తున్న ప్రశ్నలు ఇవే. ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.