రాష్ట్రంలో కొలువుదీరిన నూతన సభ - ఎన్నో ఆశలతో సాగాలి సరికొత్త బాట - Telangana Latest News
🎬 Watch Now: Feature Video
Published : Dec 9, 2023, 9:45 PM IST
Prathidwani Debate on Telangana New Assembly Meetings : తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు ప్రతిరూపంగా కొలువుదీరింది కొత్త శాసనసభ. సభ్యుల ప్రమాణ స్వీకారం కూడా పూర్తయింది. మరి వీరి మీదున్న గురుతర బాధ్యతేంటి? రాష్ట్రం ఏర్పాటయ్యాక తొలిసారి అధికార మార్పిడి జరిగింది. విపక్షాలూ బలంగా ఉన్నాయి. అసలు వీరి నుంచి ప్రజలు ఏం ఆశిస్తున్నారు? వారి ఆకాంక్షలు ఎలా ఉన్నాయి? ప్రజలంతా వారి నుంచి ఏం ఆశిస్తున్నారు? సభలో ఆ స్ఫూర్తి ప్రతిబింబించాలంటే ఏం చేయాలి?
చట్టసభలు సమావేశం అవుతున్న సమయం, బిల్లులపై చర్చ జరుగుతున్న నిడివి కూడా అంతకంతకూ తగ్గిపోతున్న తరుణంలో ఎలాంటి మార్పు అవసరం? ఈ విషయంలో యువతరం, తొలిసారి సభలో అడుగుపెడుతున్న వారికి సీనియర్లు ఏవిధంగా మార్గదర్శకులుగా ఉండాలి? జస్టిస్ వెంకటాచలయ్య కమిషన్ సిఫార్సుల ప్రకారం 70మంది కంటే ఎక్కువ సభ్యులున్నశాసన సభలు ఏడాదికి 90రోజులైనా సమావేశం కావాలి. అది రాష్ట్రంలో అమలవ్వాలంటే ఏం చేయాలి? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.