PRATHIDWANI ఎక్కడికి ఈ పరుగు స్టాక్‌మార్కెట్‌లో ఆల్‌టైమ్ రికార్డ్ - స్టాక్‌మార్కెట్‌లో ఆల్‌టైమ్ హై
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-17087276-1020-17087276-1669910317419.jpg)
అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల పవనాలతో... దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా ఎనిమిదో రోజూ దూసుకెళ్లాయి. గతకొన్ని రోజుల తరహాలోనే సూచీలు సరికొత్త జీవనకాల గరిష్ఠాల్ని నమోదు చేశాయి. అమెరికాలో వడ్డీరేట్ల పెంపు విషయంలో వేగం తగ్గిస్తామన్న ఫెడ్ ఛైర్మన్ జెరోమ్ పావెల్ సంకేతాలు సూచీల పరుగుకు మరింత దోహదం చేశాయి. చమురు ధరలు దిగువ శ్రేణుల్లో ట్రేడవుతుండడం, రూపాయి బలపడడం కూడా ర్యాలీకి కలిసొచ్చాయి. మరి సూచీల ఈ జీవితకాల గరిష్టాలు దేనికి సంకేతం. మిగిలిన అన్నిరంగాల్లో ఎంతోకొంత జోష్ నెలకొన్నా... ఐటీలో మాత్రం స్తబ్దత ఎందుకు. ఈ లాభాల పరుగు ఎందాక. స్టాక్‌మార్కెట్‌లో ఆల్‌టైమ్ హైలో సగటు మదుపర్లు గమనించాల్సిన అంశాలు ఏమిటి. ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.
Last Updated : Feb 3, 2023, 8:34 PM IST