ప్రజాప్రతినిధుల ఎంపికలో గీటురాయి - ఎలాంటి నేతల్ని ఎన్నుకుంటున్నాం? - నేటి ప్రతిధ్వని

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : Nov 8, 2023, 10:18 PM IST

Prathidwani Debate on MLA Candidate Qualifications : రాష్ట్రంలో నామినేషన్ల పర్వం జోరుగా కొనసాగుతోంది. ఎటు చూసినా ఎన్నికల కోలాహలమే. ప్రచారహోరులో పార్టీల నాయకుల్ని రాష్ట్రం మొత్తం సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. అయితే ఇక్కడ పౌరులుగా మన విధి ఏమిటి? రానున్న అయిదేళ్ల కాలానికి ఎలాంటి అభ్యర్థుల్ని ఎన్నుకోబోతున్నాం. 5 సంవత్సరాల పాటు మన తలరాతల్ని నిర్థేశించే అధికారం ఎవరి చేతుల్లో పెట్టబోతున్నాం? ఓటు వేసే ముందు 5 నిమిషాలు ఆలోచిస్తారా లేదంటే తర్వాత 5ఏళ్లు బాధ పడతారా అన్నది చాలాసందర్భాల్లో ప్రముఖల నుంచి వచ్చే మాట.

ఓటు వేసే ముందు ఆలోచించటం అంటే ఏంటి? వేటిని గమనంలో పెట్టుకోవాలి? ఇంట్లోకి ఏదైనా ఓ చిన్న వస్తువు కొనాలంటేనే ఎన్నో ఆలోచిస్తాం. అది ఏ కంపెనీ? ధర ఎంత? ఎంతకాలం మన్నుతుంది? సేవలెలా ఉంటాయి? ఇలా ఎన్నో. అలాంటిది మన భవిష్యత్‌ నిర్ణయించే అంశంలో ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి? నేతల ఎంపికలో  ఏ ఏ విషయాలు తప్పక గమనంలో పెట్టుకోవాలి? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.