Prathidwani : కోట్లపేటను తలపించిన కోకాపేట భూముల వేలం.. ఎందాకా ఈ జోరు? - ETV Bharat Special Debate
🎬 Watch Now: Feature Video
Prathidwani Debate on Kokapet Land Auction : ఒకనాటి కొండలు, గుట్టలే నేడు బంగారు తునకలవుతున్నాయి. నిన్నటి వరకు బీడుభూముల్లా కనిపించిన జాగాలే ఇవాళ కాసుల పంట పండిస్తున్నాయి. భాగ్యనగర చరిత్రలోనే రికార్డుల మోత మోగించి.. కోట్లపేటను తలపించిన కోకాపేట భూముల వేలం.. దేశమంతా చర్చనీయాంశమైంది. వర్తమాన ప్రగతి, నగర పరపతికి ఇది దర్పణమని అధికారపక్షం హర్షాతిరేకాలు ఓ వైపు.. భూములు అమ్మి భవిష్యత్‌ను ప్రశ్నార్థంలోకి నెట్టుతున్నారని ప్రతిపక్షాల విసుర్లు మరోవైపు. ఎకరం భూమి వంద కోట్లు దాటి.. బాద్‌షాగా నిలిచే హైదరాబాద్‌కు ఈ పరిణామాలు నిదర్శనం అనుకోవచ్చా? రానున్న రోజుల్లో హైదరాబాద్‌లో భూముల అందుబాటుపై ఇది ఎలాంటి ప్రభావం చూపించవచ్చు ? కోకాపేట వేలంపాటలో భూముల ధరలపై క్రెడాయ్ తెలంగాణ ఆచితూచి ఎందుకు స్పందిస్తోంది? దేశంలోని మెట్రో నగరాలన్నింటిని అధిగమించి.. ఈ స్థాయిలో భూముల ధరలు పెరగటానికి కారణం? రియల్ ఎస్టేట్ రంగంపై ఈ ప్రభావ ఎలా ఉండొచ్చు? రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందా? ఇళ్ల ధరలు ఏ స్థాయికి చేరే అవకాశం ఉంటుంది...? హైదరాబాద్ పశ్చిమానికే ఈ జోరు పరిమితమా? నగరం చుట్టూ ఈ భూం విస్తరించే అవకాశం ఉందా? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.