హైదరాబాద్ అభివృద్ధి కోసం కొత్త సర్కార్​ న్యూ ప్లాన్​ - అభివృద్ధిపై కాంగ్రెస్ ప్రణాళికలు

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : Dec 19, 2023, 10:39 PM IST

Prathidwani Debate on Hyderabad Development Plan : ఇప్పటికే రాజధాని నగర అభివృద్ధి, విస్తరణపై కొత్తగా కొలువు తీరిన కాంగ్రెస్​ ప్రభుత్వం దృష్టి పెట్టింది. ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన దగ్గర నుంచి వివిధ అంశాలపైన ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి సమీక్షలు నిర్వహించారు. వాటికి సంబంధించిన సూచనలు, ఆదేశాలు ఇవ్వడంతో పాటు సమగ్రమైన స్పష్టమైన ప్రణాళికలతో రావాలని అధికారులకు కూడా ఆదేశించారు. అలాగే నగరాన్ని ఒకే వైపు కాకుండా అన్ని వైపులా అభివృద్ధి చేయాలనే వ్యూహంతో కాంగ్రెస్​ ప్రభుత్వం ప్రణాళికలను సిద్ధం చేస్తుంది.

Congress Plans on Development : అయితే రేపటి మహానగరం ఏ విధంగా ఉండాలనే అంశంపై ప్రభుత్వ ఆలోచనలను కొన్నింటిని ప్రజల ముందుకు సీఎం రేవంత్​ రెడ్డి ఉంచారు. ఈ విషయాలపై ప్రజల్లో ఎలాంటి స్పందన వస్తుంది. అసలు ఓఆర్​ఆర్​- ఆర్​ఆర్​ఆర్​ మధ్య గ్రోత్​ పొటెన్షియాలటీ ఏమిటీ? ఈ విషయాలపై ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తే బాగుంటుంది, ఇప్పుడున్న విజన్​ ప్రకారం పర్యావరణానికి అనుకూలంగా మహానగరం అభివృద్ధి చెందాలంటే ప్రభుత్వం దగ్గర దీర్ఘ కాలిక ప్రణాళిక ఉన్నాయా వంటి అంశాలపై నేటి ప్రతిధ్వని.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.