Prathidwani: రాష్ట్రంలో గ్యాంబ్లింగ్ గ్యాంగ్‌ల కలకలం.. ఎలాంటి చర్యలు అవసరం?
🎬 Watch Now: Feature Video
Prathidwani on How to Stop Gambling Gangs: రాష్ట్రంలో ఉన్నట్టుండి మరోసారి గ్యాంబ్లింగ్ గ్యాంగ్‌ల కలకలం రేగింది. థాయ్‌లాండ్‌లో చికోటి గ్యాంగ్ అరెస్టైన ఉదంతం ఇక్కడ ప్రకంపనలు రేపుతోంది. పటాయాలో గ్యాంబ్లింగ్‌లో పట్టుబడిన 93 మందికి అక్కడి స్థానిక కోర్టు బెయిల్ అయితే మంజూరు చేసింది. ఆ 93 మందిలో 83 మంది తెలుగు రాష్ట్రాలకు చెందిన వారే ఉన్నారు. వారికి కోర్టు విధించిన జరిమానా చెల్లించగా.. పోలీసులు అందరి పాస్‌పోర్టులు తిరిగి ఇచ్చేశారు. దీంతో వారంతా స్వదేశానికి చేరుకుంటున్నట్లు సమాచారం. ఆ గ్లాంబ్లింగ్ అంతా రాష్ట్రం నుంచే జరిగింది. చికోటి ప్రవీణ్ తన అనుచరుల సాయంతో ఇదంతా చేశాడని థాయ్‌లాండ్ పోలీసుల దర్యాప్తులో తేల్చారు. కాకపోతే ఈ పరిణామాల మొత్తాన్ని ఎలా చూడాలి? గ్యాంబ్లింగ్, క్యాసినో, జూదం.. పేరు ఏదైనా ఈ ముఠాల్ని మొదట్లోనే అరికట్టడంలో మన పోలీసు వ్యవస్థలు ఎక్కడ... ఎందుకు విఫలం అవుతున్నాయి. ఇకనైనా ఎలాంటి చర్యలు అవసరం? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.