Prathidwani : ఏళ్లుగా పట్టి పీడిస్తోన్న నకిలీ విత్తనాల సమస్య.. అడ్డుకట్ట వేసేదెలా..?
🎬 Watch Now: Feature Video
Published : Sep 22, 2023, 9:39 PM IST
Prathidwani Debate on Fake Cotton Seeds Sales : నకిలీ విత్తనాల దందా గురించి ఎన్నిసార్లు చెప్పుకున్నా.. మళ్లీ మళ్లీ చెప్పుకోవాల్సి వస్తోంది. ఈ దందా నిత్యకృత్యం అవ్వడమే దీనికి కారణం. దుక్కిదున్ని.. కలుపు తీసి పంట చేతికొచ్చే వరకు కష్టించే రైతన్న.. నకిలీ విత్తనాలు గుర్తించలేక.. ఏటా మోసపోతూనే ఉన్నాడు. టాస్క్‌ఫోర్స్ దాడుల్లో టన్నుల కొద్దీ నాసిరకం పత్తి విత్తనాలు పట్టుబడుతున్నాయి. నకిలీ విత్తనాలు రాష్ట్రంలోకి రాకుండా చర్యలు తీసుకోవాల్సిన అధికారులు.. గ్రామాల్లోకి చేరినా కొరఢా ఝుళిపించడం లేదు. మరి దీనికి అంతమే లేదా? దీనిపై ప్రభుత్వం ఎలా స్పందిస్తోంది? ఏం చర్యలు తీసుకుంటే నకిలీ విత్తనాలకు అడ్డుకట్ట వేయవచ్చు..?
Fake Cotton Seeds Sale In Telangana : ఏళ్ల తరబడి వ్యవసాయ రంగం, రైతన్నలను పట్టి పీడిస్తున్న నకిలీ, కల్తీ విత్తనాల విషయంలో ఓ కీలక పరిణామం చోటుచేసుకుంది. నాసిరకం విత్తనాలు సరఫరా చేసినందుకు గానూ రైతులకు పరిహారం చెల్లించాలని సదరు సంస్థ, అమ్మకందారును ఆదేశించింది రాష్ట్ర వినియోగదారుల కమిషన్. మరి.. ఈ ఆదేశాల ప్రాధాన్యత ఏమిటి? అసలు.. ఏటా చర్యలు తీసుకుంటున్నా నకిలీ విత్తన ముఠాలు ఎందుకు ఆగడం లేదు. అన్నిరంగాల్లో ఎంతో పురోభివృద్ధి సాధిస్తున్నా రైతులకు కావాల్సిన నాణ్యమైన విత్తనాలు అందించడంలో ఇంకెంతకాలం ఈ కష్టనష్టాలు? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.