Prathidwani : సార్వత్రానికి అసలైన సెమీ ఫైనల్.. మరి గెలుపు ఎవరి చెంతకు..? - 5 రాష్ట్రాల ఎన్నికలపై ప్రతిధ్వని కార్యక్రమం

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telugu Team

Published : Oct 9, 2023, 9:22 PM IST

Prathidwani Debate on 5 States Elections : దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న 5 రాష్ట్రాల శాసనసభ ఎన్నికలకు షెడ్యూల్‌(Elections Schedule) విడుదలైంది. తెలంగాణ, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌, రాజస్థాన్‌, మిజోరం రాష్ట్రాల ఎన్నికలకు ఈసీ తేదీలు ప్రకటించింది. కాంగ్రెస్‌, బీజేపీ సహా తెలంగాణాలో బీఆర్‌ఎస్‌ ఈ ఎన్నికల(Elections)ను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్నాయి. ఇండియా కూటమి ఏర్పాటు తమకు కలిసి వస్తుందని కాంగ్రెస్‌ భావిస్తుండగా.. దాన్ని నిలువరించాలని బీజేపీ ఎత్తులు వేస్తోంది. ఈ 5 రాష్ట్రాల ఎన్నికల ప్రభావం మరో ఆరునెలల్లో జరగబోయే లోక్‌సభ ఎన్నికలపై ఏ మేరకు ఉండవచ్చు?

Debate on 5 States Elections : గత పదేళ్లలో వరుస ఓటములతో కాంగ్రెస్‌ పాఠం నేర్చుకుందా అన్నది కూడా ఈ ఎన్నికల్లో తేలనుంది. ఈ ఎన్నికల్లో ధరలు సహా అనేక అంశాలు ప్రభావం చూపించబోతున్నాయి. ఈ ఎన్నికల గెలిచి మరో ఆరునెలల్లో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో నైతిక స్థైర్యం కూడగట్టుకోవాలని అన్ని పార్టీలు భావిస్తున్నాయి. గత శాసనసభ ఎన్నికల ఫలితాలు లోక్‌సభలో పునరావృతం కాని నేపథ్యంలో ఈ సారి ఎలాంటి ఫలితాలు వస్తాయో అన్నదానిపై ఉత్కంఠ నెలకొంది.  

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.