మెగా డీఎస్సీ దిశగా ప్రభుత్వం- నిరుద్యోగుల్లో చిగురిస్తున్న ఆశలు - సీఎం రేవంత్ రెడ్డి ఆన్ మెగా డీఎస్సీ
🎬 Watch Now: Feature Video
Published : Dec 16, 2023, 9:07 PM IST
Prathidhwani on Mega DSC : ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మెగా డీఎస్సీ దిశగానే అడుగులు వేస్తోంది కొత్తగా కొలువు దీరిన కాంగ్రెస్ ప్రభుత్వం. గత ప్రభుత్వంలో ప్రకటించిన 5089 పోస్టుల డీఎస్సీ స్థానంలో 9800 ఖాళీలతో మెగా డీఎస్సీ(Mega DSC)కి రంగం సిద్ధం చేస్తున్నట్లు సంకేతాలు ఇచ్చారు. అందుకు సంబంధించి శుక్రవారం అసెంబ్లీలో గవర్నర్ తమిళిసై ప్రసంగంలోనూ వచ్చే 6 నెలల్లో మెగా డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ అని వెల్లడించారు.
Discussion on Telangana Mega DSC Notification : ఇప్పటికే గత నోటిఫికేషన్ ద్వారా సుమారు 1.77 లక్షలమంది దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తుల ప్రక్రియ, పరీక్షల నిర్వహణపై ఆర్థికశాఖ అధికారులతో విద్యాశాఖ అధికారులు సమావేశమై చర్చించారు. అనుబంధ నోటిఫికేషన్ జారీ చేయాలని ఆలోచనపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. కొత్త విద్యా సంవత్సరాని(New Academic Year)కి పూర్తైతే విద్యార్థులకు ప్రయోజనం ఉంటుందని విద్యావేత్తలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో డీఎస్సీ అభ్యర్థుల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.