Prathidhwani : అభ్యర్థులు.. అఫిడవిట్లు.. పూర్తి వివరాలు వెల్లడి చేయకపోతే.. పరిణామాలేంటి..? - ఎమ్మెల్యే అభ్యర్థుల నేర చరిత్రపై ప్రతిధ్వని
🎬 Watch Now: Feature Video
Published : Oct 17, 2023, 9:07 PM IST
Prathidhwani : ఒకర్ని ప్రజా ప్రతినిధిగా ఎన్నుకోవాలంటే... సదరు అభ్యర్థి నేపథ్యాన్ని ఓటరు తెలుసుకోవడం చాలా ముఖ్యం. వారి వ్యక్తిగత వివరాలు, అప్పులు, ఆస్తులతో పాటు.... గతంలో వారి ప్రవర్తన, చేపట్టిన కార్యక్రమాలు కీలకమవుతాయి. మరి, అభ్యర్థులకు నేర చరిత్ర ఉంటే ఎలా..? వారి నేరాల చిట్టా ప్రజలకు తెలియడం ఎలా..? ఎన్నికల అఫిడవిట్‌లో అభ్యర్థులు తప్పక తెలియజేయాల్సిన వివరాలు ఏమిటి? ఎన్నికల ప్రక్రియలో ఈ అఫిడవిట్‌ల పాత్ర ఏమిటి?
ఈ ఉద్దేశంతోనే సుప్రీంకోర్టుతో పాటు ఎన్నికల సంఘం కూడా అభ్యర్థుల పూర్తి వివరాలు తమ అఫిడవిట్‌లలో బహిర్గతం చేయాలని పార్టీలను ఆదేశించింది. ఆ వివరాలు ఎందుకు... ఎంత... కీలకమో ఇటీవల కొన్ని కోర్టు తీర్పులు కూడా తెలిసొచ్చేలా చేశాయి. ఏ పార్టీకి చెందిన అభ్యర్థులైన అఫిడవిట్‌ల్లో తమ పూర్తి వెల్లడి చేయకుంటే ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇటీవలి కోర్టు నిర్ణయాలు ఈ విషయంలో ఏం చెబుతున్నాయి? ప్రస్తుతం ఎన్నికల ముందు నిలిచిన తెలంగాణలోనూ ఇప్పుడదే విషయంలో చర్చ జరుగుతోంది. పార్టీలు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు కనిపిస్తోంది. ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.