రోడ్డుపై ప్రత్యక్షమైన ప్రజా పాలన దరఖాస్తులు - కారణమిదే!
🎬 Watch Now: Feature Video
Praja Palana Applications on Balanagar Road : ప్రజా సంక్షేమం పథకాల అమలు కోసం కొత్త ప్రభుత్వం స్వీకరించిన ప్రజాపాలన దరఖాస్తులు రోడ్డుపై ప్రత్యక్షమయ్యాయి. దరఖాస్తు పేపర్లు కనిపించడంతో ప్రజలు అయోమయానికి గురైన ఘటన బాలానగర్‌లో చోటుచేసుకుంది. సోమవారం మధ్యాహ్నం సమయంలో బాలానగర్ ఫ్లైఓవర్ పై ఓ ద్విచక్ర వాహనంపై తరలిస్తున్న ప్రజాపాలన దరఖాస్తులు రోడ్డుపై పడ్డాయి. ఆ వాహనదారుడు కింద పడిన దరఖాస్తులను తీసుకుంటుండగా, అది గమనించిన స్థానికులు దరఖాస్తులను గమనించి వాహనదారుడుని నిలదీశారు.
ఆ దరఖాస్తులు హయత్ నగర్ సర్కిల్‌కు చెందినవి కాగా, బాలానగర్‌లో ఎందుకు ఉన్నాయని వారు ప్రశ్నించారు. దీంతో అతను ర్యాపిడో బుక్ చేయగా తాను కేవలం వాటిని ఓ చోటు నుంచి మరో చోటుకు తరలిస్తునన్నానని, అంతకు మించి తనకేమీ తెలియదని తెలిపాడు. అట్ట పెట్టెలో 500కు పైగా దరఖాస్తులు ఉండగా, వాటిపై హయత్ నగర్ సర్కిల్ పేరు రాసి ఉంది. అసలు సంబంధం లేని ప్రాంతానికి అవి ఎందుకొచ్చాయన్నది ప్రశ్నార్థకంగా మారింది.