మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన పొన్నం ప్రభాకర్ - మూడు ఫైళ్లపై సంతకం - మంత్రిగా పొన్నం బాధ్యత స్వీకరణ
🎬 Watch Now: Feature Video
Published : Dec 18, 2023, 5:25 PM IST
Ponnam Taking Charge As Minister of Telangana : రాష్ట్ర రవాణ, బీసీ సంక్షేమ శాఖల మంత్రిగా పొన్నం ప్రభాకర్ సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు. రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రిగా పేషీలోకి రాగానే వేదపండితులు ఆశీర్వచనాలు అందించారు. ఆర్టీసీ, రవాణ శాఖకు సంబంధించిన మూడు ఫైళ్లపై పొన్నం ప్రభాకర్ సంతకాలు చేశారు. బస్‌పాస్‌ల రాయితీల ఖర్చు రీఎంబర్స్మెంట్ కోసం రూ.375 కోట్లను విడుదల చేస్తూ ఫైల్‌పై సంతకం చేశారు.
రవాణశాఖలో మరణించిన హెడ్ కానిస్టేబుల్ భార్యకు లక్ష రూపాయలు మెడిక్లెయిమ్ మంజూరు చేస్తూ మరో ఫైల్‌పై సంతకం చేశారు. మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు, విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యే వివేక్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ముఖ్యకార్యదర్శులు బుర్రా వెంకటేషం, వాణీ ప్రసాద్, ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తదితరులు పొన్నం ప్రభాకర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఇప్పటికే మిగతా అమాత్యులు వారి పేషీల్లో బాధ్యతలు స్వీకరించగా ఇవాళ మంచిరోజు అని మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.