ఎగ్జిట్ పోల్ ఫలితాలతో కేటీఆర్ భయపడుతున్నారు - అందుకే వాటిని తప్పుగా చిత్రీకరిస్తున్నారు : పొన్నం ప్రభాకర్ - సిద్దిపేట తాజా వార్తలు
🎬 Watch Now: Feature Video
Published : Dec 1, 2023, 6:35 PM IST
Ponnam Prabhakar Visit EVM Strong Room : తెలంగాణలో దొరల పాలన పోయి ప్రజలు, ప్రజాస్వామ్యం గెలువబోతుందని హుస్నాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఇందూర్ ఇంజినీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన.. స్ట్రాంగ్ రూమ్, భద్రతా సిబ్బందిని ఆయన పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రజలు పది సంవత్సరాలుగా ప్రగతిభవన్ పాలనలో బందీ అయ్యరన్నారు. ఈ ఎన్నికల్లో దొరల పాలనకు స్వస్తి పలికి.. ప్రజాపాలనకు స్వాగతం పలకనున్నారని ధీమా వ్యక్తం చేశారు.
Telangana Election Results 2023 : డిసెంబర్ 3న వెలువడే ఫలితాల్లో.. కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం ఖాయమన్నారు. మూడు నెలల క్రితమే రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ.. కాంగ్రెస్ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారన్నారు. ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి ఆరు గ్యారెంటీలను పారదర్శకంగా అమలు చేస్తామన్నారు. ఎగ్జిట్ పోల్ సర్వేలు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా రావడంతో మంత్రి కేటీఆర్ భయపడుతున్నారని.. అందుకే వాటిని తప్పుగా చిత్రీకరిస్తున్నారన్నారు. ఒకవేళ బీఆర్ఎస్కు అనుకూలంగా వస్తే కరెక్ట్ అని అనేవారని ఎద్దేవా చేశారు. బీజేపీ డబుల్ ఇంజిన్ అంటే.. 2 సీట్లు రావాలని అనుకున్నారేమో అని పొన్నం ఎద్దేవా చేశారు.