97 మంది ఓటర్ల కోసం కొండల మధ్య పోలింగ్ సిబ్బంది సాహసం - himachal pradesh polling stations
🎬 Watch Now: Feature Video
హిమాచల్ ప్రదేశ్‌లోని కర్సోగ్‌లో ఎన్నికల నిర్వహణ కోసం పోలింగ్ సిబ్బంది పెద్ద సాహసమే చేశారు. 97 మంది ఓటర్లు ఉన్న మాగన్ ప్రాంతానికి చేరుకునేందుకు సరైన రోడ్డు సదుపాయం లేకపోవడం వల్ల దాదాపు పర్వత ప్రాంతాల్లో నాలుగు కిలోమీటర్లు ఓటింగ్ యంత్రాలు మోసుకుంటూ నడిచారు. చివర్లో ప్రమాదకరమైన రోప్‌వే సాయంతో సత్లెజ్ నది దాటారు. అలా ఉదయం 11 గంటలకు మొదలైన వారి ప్రయాణం ముగిసి పోలింగ్ స్టేషన్‌కు చేరుకునే సరికి చిమ్మచీకటి కమ్ముకుంది. శనివారం హిమాచల్ ప్రదేశ్ శాసనసభ ఎన్నికల పోలింగ్ జరగనుంది.
Last Updated : Feb 3, 2023, 8:32 PM IST