Shabbir Ali vs Gampa Govardhan : కామారెడ్డిలో వేడెక్కిన 'డబుల్‌' రాజకీయం - Gampa Govardhan Latest News

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jun 19, 2023, 1:44 PM IST

Political Heat in Kamareddy : కామారెడ్డిలో అధికార, ప్రతిపక్ష నాయకుల సవాల్‌.. ప్రతి సవాళ్లతో రాజకీయం రసవత్తరంగా మారింది. రెండు పడక గదుల ఇళ్ల నాణ్యతపై.. కాంగ్రెస్ నేత షబ్బీర్‌ అలీ, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే గంప గోవర్దన్ మధ్య మాటల తూటాలు పేలాయి. ఈ నెల 7న కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని టేక్రియాల్‌లో నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇళ్లను షబ్బీర్‌ అలీ పరిశీలించారు. ఈ సందర్భంగా ఇళ్లు నాణ్యతగా నిర్మించలేదని ఆయన విమర్శించారు. ఎప్పుడు కూలిపోతాయో తెలియదన్న షబ్బీర్‌ అలీ.. కాంట్రాక్టర్ల జేబులు నింపుకోవడానికే వీటిని నిర్మించారని మండిపడ్డారు. 

ఈ ఆరోపణలను ఎమ్మెల్యే గంప గోవర్దన్‌ తిప్పికొట్టారు. కామారెడ్డి నియోజకవర్గంలో నాణ్యతతో ఇళ్లు నిర్మించారన్న ఆయన.. కేవలం రాజకీయ పబ్బం గడుపుకోవడానికి షబ్బీర్ అలీ విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. దమ్ముంటే ఇంజినీర్లను తీసుకుని రా అంటూ షబ్బీర్ అలీకి సవాల్ విసిరారు. గంప గోవర్దన్ విసిరిన సవాల్‌ను స్వీకరించిన షబ్బీర్ అలీ.. నేడు ఇంజినీర్‌ను తీసుకుని ఇళ్ల వద్దకు వెళ్లారు. ఎమ్మెల్యే కోసం ఎదురు చూస్తున్నారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.