Police Seize 2KG Gold in Hyderabad : పోలీసుల ముమ్మర తనిఖీలు.. వేర్వేరు చోట్ల 2 కిలోల బంగారం, రూ. 20 లక్షలు స్వాధీనం - Telangana Assembly Elections 2023
🎬 Watch Now: Feature Video
Published : Oct 18, 2023, 9:21 PM IST
Police Seize 2KG Gold in Hyderabad : రాష్ట్రంలో ఎన్నికల కోడ్ నేపథ్యంలో వాహన తనిఖీల్లో భాగంగా.. నగరంలో వేర్వేరు చోట్ల 2 కిలోల బంగారం, 20 లక్షల నగదు పట్టుబడ్డాయి. మహంకాళి పోలీస్‌స్టేషన్ పరిధిలోని స్వప్నలోక్ కాంప్లెక్స్ వద్ద.. ద్విచక్ర వాహనంపై శ్రీకాంత్ అనే వ్యక్తి బంగారాన్ని తీసుకెళ్తున్న క్రమంలో.. తనిఖీలలో భాగంగా పోలీసులు పట్టుకున్నారు. కోటి 20 లక్షల రూపాయల విలువైన.. రెండు కిలోల బంగారు బిస్కెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
జనరల్ బజార్లో అనుమానాస్పదంగా తిరుగుతుండడంతో పోలీసులు తనిఖీ చేయగా.. బంగారు బిస్కెట్లు లభ్యమయ్యాయి. నిర్మల్‌లోని సహస్ర జ్యువెలరీ యజమాని రాజశేఖర్.. ఆదిలాబాద్‌కు చెందిన సిద్ధివినాయక జువెలర్స్ యజమాని అరుణ్ ఆదేశాల మేరకు హైదరాబాదులోని జనరల్ బజార్లో 9 బంగారు బిస్కెట్లు తీసుకున్నట్లు పోలీసుల విచారణలో వెళ్లడయ్యింది. మరో చోట హైదరాబాద్ కార్వాన్ కూడలి వద్ద పోలీసులు వాహనాలను తనిఖీలు చేస్తున్న సమయంలో.. వోల్వో కారులో 20 లక్షల రూపాయలు తరలిస్తుండగా జప్తు చేశారు. నగదుకు సంబంధించి ఎటువంటి రశీదులు చూపించకపోవడంతో.. ఐటీ అధికారులకు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు.