ఆలయ పరిసరాలను శుద్ధి చేసిన ప్రధాని మోదీ- శ్రమదానం చేయాలని ప్రజలకు పిలుపు
🎬 Watch Now: Feature Video
Published : Jan 12, 2024, 7:38 PM IST
PM Modi Temple Cleaning : అయోధ్యలోని రామాలయ ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకొని ఆలయాలు, పుణ్యక్షేత్రాల్లో శ్రమదానం నిర్వహించాలని దేశ ప్రజలకు పిలుపునిచ్చిన ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. మహారాష్ట్ర పర్యటన ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ నాసిక్‌లో ఉన్న కాలారామ్ ఆలయంలో పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ పరిసరాలను శుభ్రం చేశారు. స్వయంగా క్లీనర్ చేతపట్టుకుని ఆలయ ప్రాంగణాన్ని శుద్ధి చేశారు. ఈ క్రమంలో నాసిక్‌లో స్వచ్ఛ అభియాన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఆలయంలో నిర్వహించిన రామాయణ పారాయణంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. 'సంత్ ఏక్‌నాథ్ మరాఠీలో రచించిన 'భావార్థ రామాయణం'లో శ్రీరాముడు అయోధ్యకు తిరిగివచ్చే ఘట్టాన్ని వివరిస్తూ సాగే శ్లోకాలను విన్నాను. ఈ పారాయణం చాలా ప్రత్యేకమైన అనుభవం' అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. కాలారామ్ ఆలయ కమిటీ సభ్యులు ప్రధాని మోదీకి ప్రశంసా పత్రం, జ్ఞాపిక, వెండి రాముడి విగ్రహం, సీతారాములు, లక్ష్మణుడి ఫొటోను ఇచ్చారు. అలాగే మోదీకి ప్రసాదాన్ని అందించారు. అంతకుముందు ఆలయ సమీపంలో స్వామి వివేకానందుడి విగ్రహానికి నివాళులర్పించారు.