Kng fisher Air Lines : ఆకాశంలో ఎగరాల్సిన విమానం.. నేలమీదకు వచ్చింది

🎬 Watch Now: Feature Video

thumbnail

An airplane on the road in Adilabad: ఒక్కప్పుడు ఆకాశాన పక్షిలా ఎగిరిన విమానాలు .. ఇప్పుడు నేలపై మరో వాహనంపై తీసుకెళ్లే పరిస్థితి ఏర్పడింది. ఆ   విమాన సంస్థకి ఇలాంటి పరిస్థితి రావడానికి కారణం ఈ సంస్థ అధినేత. ఇంతకీ ఆ విమాన సంస్థ పేరు ఎంటో అని ఆలోచిస్తున్నారా..! మనందరికి తెలిసినవే.. కింగ్​ ఫిషర్​ ఎయిర్​ లైన్స్.  దీని సంస్థ అధినేత మరేవరో కాదు కోట్ల డబ్బులతో విదేశాలకు వెళ్లిపోయిన విజయ్​మాల్యా. అతను దివాళా తీసినందున కేంద్ర ప్రభుత్వం అప్పులు వసూలు చేసే క్రమంలో ఈ విమానాలను సీజ్​ చేసింది. వాటిని విడి భాగాలుగా చేసి విక్రయించేలా నిర్ణయం తీసుకుంది. దీంతో కింగ్ ఫిషర్​ ఎయిర్​ లైన్​కి చెందిన ఒక విమానాన్ని విడి భాగాలుగా చేసి లారీపై ఎక్కించారు. ఈ లారీ చెన్నై నుంచి ఉత్తరప్రదేశ్​లోని ఆగ్రాకి వెళ్తున్న క్రమంలో ఆదిలాబాద్ జాతీయ రహదారి మీదగా వెళ్లింది. దీంతో స్థానికులందరూ ఆసక్తిగా తిలకించారు. ఈ నెల 2న చెన్నై నుంచి బయలుదేరిందని లారీ డ్రైవర్​ చెప్పాడు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.