ఇదేందయ్యా ఇది! మట్టితో స్నానం చేస్తే ఆరోగ్యానికి మంచిదట..! - mud bath in allisagar
🎬 Watch Now: Feature Video
People taking mud bath at Alisagar Park: నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం అలిసాగర్ ఉద్యానవనంలో కొంతమంది మట్టి స్నానాలు ఆచరించారు. ఈ స్నానం ఇష్టం ఉన్న వ్యక్తులు అధిక సంఖ్యలో వచ్చి నృత్యాలు చేస్తూ ఆనందంగా గడిపారు. దీనివల్ల శరీరంలో చేరిన మలిన పదార్థాలు దూరమవుతాయని చెప్పారు. గజ్జి, తామర, బీపీ, షుగర్, చుండ్రు వంటి ఒంటిరోగాలు తగ్గుతాయని యోగా గురువులు తెలిపారు. ఈ సంప్రదాయం పూర్వీకుల నుంచి వచ్చిందని వివరించారు. అందుకే వ్యవసాయం చేసేవారికి ఎక్కువగా చర్మవ్యాధులు రావని అన్నారు.
కానుగ, తులసి, వేపాకు రసం లాంటి కొన్ని మూలికలను రసంగా చేసి పుట్ట మట్టి, బుర్గుల మట్టి, తులసి, ఆవుపేడ, ఆవు మూత్రం వంటి వాటితో కలిపి 45 నిమిషాలు నానబెట్టిన తర్వాత శరీరానికి పూసుకోవాలని పేర్కొన్నారు. వనమూలికలతో తయారు చేసిన సబ్బులను మాత్రమే శరీరానికి వాడాలని అన్నారు. ఏడాదికొకసారి మట్టి స్నానం చేయాలని సూచించారు. ప్రతి ఒక్కరు ఉదయాన్నే యోగ చేసి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్నారు.