భాగ్యనగరంలో పెట్రోల్ కష్టాలు - దొరికిన వాడే హీరో - No Fuel in Hyderabad
🎬 Watch Now: Feature Video
Published : Jan 2, 2024, 8:46 PM IST
People Queue at Petrol Stations in Hyderabad : హైదరాబాద్ నగరంలో జనాలు పెట్రోల్ కోసం పెట్రోల్ బంకుల వద్ద బారులు తీరారు. వాటర్ బాటిల్స్, క్యాన్లు వంటివి పట్టుకొని వచ్చి అందులో పెట్రోల్ నింపుకొని వెళుతున్నారు. కొన్ని బంకుల వద్ద అయితే కిలో మీటర్ల మేర వాహనాల క్యూలైన్లు ఉన్నాయి. ఇదంతా ఆయిల్ ట్యాంకు డ్రైవర్లు సమ్మె చేస్తారని చెప్పడంతో రాష్ట్రంలో రానున్న మూడు రోజులు పెట్రోల్ దొరకదనే ఉద్దేశంతో జనాలు బంకుల వద్దకు పరుగులు తీశారు.
నిజంగా పెట్రోల్ కష్టాలు మొదలయ్యాయా అనే ఉన్నాయి ఈ వీడియోలోని దృశ్యాలు చూస్తే, ఓ వ్యక్తి బైకుపై 20 లీటర్ల వాటర్ క్యాన్ ఫుల్గా పెట్రోల్ పట్టుకొని వెళుతున్నాడు. మరొకరు అట్టపెట్టేల్లో బాటిల్స్ తీసుకొచ్చి అందులో పెట్రోల్ పోయించుకొని వెళుతున్నారు. ఇప్పుడు భాగ్యనగరమంతా పెట్రోల్, డీజిల్ జపం చేస్తుండనడంలో ఎటువంటి సందేహం లేదు. వీరి పెట్రోల్, డీజిల్ వల్ల కిలోమీటర్ల మీర ట్రాఫిక్ జాం మై, నగరంలో రోడ్లన్నీ వాహనాలతో నిండిపోయాయి.