Peacock Dance Video : 'పురివిప్పిన నెమలి' అందం.. చూసేందుకు రెండు కళ్లూ చాలవంతే - Peacock dance video
🎬 Watch Now: Feature Video
Peacock dance in Medak : ఎవరైనా అమ్మాయి అందంగా నాట్యం చేస్తే.. అచ్చం నెమలిలా నాట్యం చేసినట్లుందని పొగుడుతాం. మరి అలాంటిది ఓ నెమలే ప్రకృతి ఒడిలో పురి విప్పి నాట్యం చేస్తే.. ఆ దృశ్యాన్ని వర్ణించడం సాధ్యమేనా? నిజం చెప్పాలంటే వర్ణించడం కష్టమే. ఎందుకంటే నెమలి నాట్యం చేయడం చూస్తే.. ప్రకృతిలో ఇంతకు మించిన అందమైన దృశ్యం ఉంటుందా అని అనిపించక మానదు.
ఇక విషయానికి వస్తే.. మెదక్ జిల్లా రామాయంపేట మండలం కోనాపూర్‌లో ఇలాంటి దృశ్యమే కనిపించింది. పచ్చని ఆహ్లాదకర వాతావరణంలో అందమైన నెమలి పురి విప్పి నాట్యం చేసింది. రైతు బ్రహ్మానంద రెడ్డి పొలం సమీపంలో మయూరం నాట్యం అందరినీ కనువిందు చేసింది. నెమలి పురివిప్పి ఆడుతూ అక్కడ ఉన్న రైతులను ఆకట్టుకుంది. ఉదయం వేళ చిరుజల్లులు పడుతుంటే ప్రకృతి ఎంతో రమణీయంగా ఉంటుంది. ఆ అద్భుత సమయంలో ప్రకృతి రమణీయతను ఆస్వాదిస్తూ నెమలి పురి విప్పి నాట్యం చేసింది. ఈ దృశ్యాన్ని చూసి స్థానికులు తమ సెల్ఫోన్లలో బంధించారు. ఈ ప్రాంతంలో అడవుల్లో ఉన్న మయూరాలు చిరుజల్లుల సమయంలో నాట్యం చేస్తూ ప్రకృతి ప్రేమికుల మనసును దోచుకుంటున్నాయి. ఈ దృశ్యాన్ని చూసిన ప్రతి ఒక్కరూ వావ్ అంటున్నారు.