ఆంధ్రప్రదేశ్ నాకు జన్మనిస్తే తెలంగాణ రాష్ట్రం పునర్జన్మనిచ్చింది : పవన్ కళ్యాణ్ - రఘునందన్ రావు ఎన్నికల ప్రచారం
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/23-11-2023/640-480-20097037-thumbnail-16x9-pawan-kalyan-election-campaign-in.jpg)
![ETV Bharat Telangana Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/telangana-1716536068.jpeg)
Published : Nov 23, 2023, 7:04 PM IST
Pawan Kalyan Election Campaign in dubbaka : పోరాడి సాధించుకున్న ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు సముచిత ప్రాధాన్యత దక్కడం లేదని జనసేన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం చేగుంట మండలలో రఘునందన్ రావుకు మద్దతుగా రోడ్ షోలో పాల్గొన్నారు. వకీల్ సాబ్ అఖండ విజయం సాధించడానికి జనసేన కార్యకర్తలు.. అభిమానులు సైనికుల్లా కృషి చేయాలన్నారు. బంగారు తెలంగాణ సంపూర్ణ వికాసానికి బీజేపీ కృషి చేస్తుందన్నారు.
నరేంద్ర మోడీ నాయకత్వంలో యువతకు ఉపాధి అవకాశాలు వస్తాయని అన్నారు. ఆడబిడ్డల సంక్షేమానికి బీజేపీ ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. దుబ్బాక నియోజకవర్గంలో 2009లో ప్రజా యుద్ధనౌక గద్దర్ నిర్వహించిన తెలంగాణ పోరాటంలో తాను పాల్గొన్నానని గుర్తు చేశారు. బీజేపీ 21 మంది బీసీ సామాజిక వర్గానికి చెందిన వారికి ఎమ్మెల్యే టికెట్ కేటాయించడం హర్షనీయమన్నారు. ఆంధ్రప్రదేశ్ నాకు జన్మనిస్తే తెలంగాణ రాష్ట్రం పునర్జన్మనిచ్చిందని తెలిపారు. బంగారు తెలంగాణ పునర్నిర్మాణంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలన్నారు.