మా గెలుపునకు సహకరిస్తే నిన్ను ఎమ్మెల్సీ చేస్తాం - రాజయ్యకు పల్లా, కడియం ఆఫర్ - telangana BRS Politics
🎬 Watch Now: Feature Video
Published : Nov 6, 2023, 11:30 AM IST
|Updated : Nov 6, 2023, 1:54 PM IST
Palla Rajeshwar Reddy Offer to MLA Rajaaiah : అభ్యర్థుల ఖరారుకు ముందు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయంగా నిలిచిన స్టేషన్ ఘన్‌పూర్ రాజకీయం.. ఎన్నికల ప్రచారంలోనూ ఆసక్తికరంగా సాగుతోంది. హనుమకొండ జిల్లా వేలేరు మండలం షోడాశపల్లిలో జరిగిన నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశంలో తాటికొండ రాజయ్య, కడియం శ్రీహరి, పల్లా రాజేశ్వర రెడ్డి మధ్య ఆసక్తికర చర్చ సాగింది. ఇప్పుడు ఎమ్మెల్సీలుగా ఉన్న కడియం, పల్లా గెలుపునకు కృషి చేస్తే.. రాజయ్యను ఎమ్మెల్సీ అయ్యేలా సహకరిస్తామని పల్లా రాజేశ్వర్ రెడ్డి వెల్లడించారు.
కడియం శ్రీహరి మాట్లాడుతూ.. తనది రాజకీయ కుటుంబం కాదని, కోట్ల రూపాయల ఆస్తులు లేవని అన్నారు. తన బలం, బలగం అంతా నిజాయితీ, ప్రజలేనని వారే తనను గెలిపిస్తారని కడియం ఆశా భావం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ అభ్యర్థి కడియం శ్రీహరిని పార్టీ శ్రేణులంతా కష్టపడి గెలిపించాలని రాజయ్య కోరారు. అధిష్ఠానం గుర్తించి కడియం శ్రీహరికి టికెట్ ఇవ్వడం జరిగిందని బీఆర్ఎస్ పార్టీ గెలిస్తేనే తమకు ఉనికి ఉంటుందని ఆయన అన్నారు.