Palamuru Rangareddy Lift Irrigation Project : పాలమూరు-రంగారెడ్డితో 12.30 లక్షల ఎకరాలకు సాగు నీరు.. 1200పైగా గ్రామాలకు తాగునీరు
🎬 Watch Now: Feature Video
Palamuru Rangareddy Lift Irrigation Project : తెలంగాణ వరప్రదాయిని.. ప్రతిష్ఠాత్మక పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం స్వప్నం సాకారమైంది. ఎన్నో దశాబ్దాలుగా కరవు కాటకాలు, వలసలకు నిలయమైన పాలమూరు ఇక సస్యశ్యామలం కాబోతోంది. శ్రీశైలం బ్యాక్ వాటర్‌ను సద్వినియోగం చేసుకునే క్రమంలో తెలంగాణలో ఉమ్మడి మహబూబ్‌నగర్ సహా రంగారెడ్డి, వికారాబాద్, నల్గొండ జిల్లాల్లో 12.30 లక్షల ఎకరాలకు సాగు నీరు, 1200 పైగా గ్రామాలకు తాగు నీరు అందించే ఈ ప్రాజెక్టు త్వరలోనే అందుబాటులోకి రానుంది.
Niranjan Reddy On Palamuru Rangareddy : కాళేశ్వరం ఎత్తిపోతల పథకం అనంతరం గొప్ప సత్ఫలితాలు ఇవ్వనున్న పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ఈ నెల 16వ తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించనున్న నేపథ్యంలో.. పాలమూరులో ఊరూర పండగ వాతావరణ నెలకొననుంది. ఈ ప్రాజెక్టులో ప్రపంచ స్థాయి నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా అత్యాధునిక సాంకేతికత పరిజ్ఞానం ఉపయోగించి.. కాళేశ్వరం రికార్డు బ్రేక్ చేసేలా.. 145 మెగావాట్ల సామర్థ్యం గల మహా బాహుబలి మోటార్లు ఏర్పాటు చేశామని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు. శ్రీశైలం జలాశయం బ్యాక్ వాటర్ నుంచి రోజు 2 టీఎంసీల నీరు లిఫ్ట్ చేసే విధంగా ప్రాజెక్టు నమూనా రూపొందించామని వెల్లడించారు. కృష్ణమ్మ నీళ్లలో కాళ్లు కడగుతామని... ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నామన్న మంత్రి నిరంజన్ రెడ్డితో ముఖాముఖి.