Padana Telugu Paata Programme in Canada : కెనడాలో "పాడనా తెలుగు పాట" కార్యక్రమం.. పాటలతో అదరగొట్టిన కంటెస్టెంట్లు - పాడనా తెలుగు పాట విన్నర్స్​

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : Oct 17, 2023, 12:51 PM IST

Padana Telugu Paata Program in Canada : తెలుగు తల్లి కెనడా, ఓంటారియో తెలుగు ఫౌండేషన్ సంయుక్తంగా మొట్టమొదటిసారి కెనడా టొరాంటో నగరంలో "పాడనా తెలుగు పాట" కార్యక్రమాన్ని నిర్వహించాయి.  ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన టీవీ కళలు కార్యక్రమ నిర్వాహకులు గూడూరు శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ ప్రోగ్రామ్​లో ప్రతి ఒక్క కంటెస్టెంట్ చక్కగా పాడారు. ఈ పాటల పోటీలో ప్రీ టీన్స్ విభాగంలో ప్రథమ బహుమతి వికసిని అలవలపాటి, టీన్స్ విభాగంలో ఆశ్రిత పొన్నపల్లి, అడల్ట్స్  విభాగంలో గాయత్రి తణుకు ప్రథమ బహుమతి దక్కించుకున్నారు. 

ప్రతి విభాగంలోనూ ముగ్గురికి తన మ్యూజిక్ డైరెక్షన్​లో పాడే అవకాశం ఇస్తానని శ్రీ జోశ్య భట్ల ప్రకటించడంతో కంటెస్టెంట్లు హర్షం వ్యక్తం చేశారు. ఇలాంటి కార్యక్రమం కెనడాలో నిర్వహించడం గర్వకారణంగా ఉందని, ఈ కార్యక్రమానికి ఆర్థిక సహకారం అందించిన గెట్ హోమ్ రియాలిటీ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో 500 మందికి పైగా ఆహుతులు పాల్గొన్నారు.  

ఈ సందర్భంగా వంశీ రామరాజని విశ్వ కళా సేవా భూషణ బిరుదుతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో నటుడు చంద్రమోహన్, గెట్ హోం రియాల్టీ నించి రమేశ్ గొల్లు, ఆనంద్ పెరిచెర్ల, రఘు జూలూరి రాయవరపు విజయగోపాల రాజు, లక్ష్మి రాయవరపు, మురళి పగిడేల, శివజ్యోతి పగిడేల, శ్రీనివాస్ నారు,  పద్మిని నారు జ్యోతి ప్రకాశనం చేయగా, రుక్మిణి మద్దులూరి.. తదితరులు పాల్గొన్నారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.