బత్తాయి కాయలు కోసిందని.. చిన్నారిని గొలుసులతో కట్టేసి
🎬 Watch Now: Feature Video
బాల్యంలో వేసవి సెలవులు ఓ మధురానుభూతి.. ఎటువంటి చదువుగోల ఉండదు. బంధువుల ఇంటికి వెళ్లడం, స్నేహితులతో కలిసి ఆడుకోవడం ఇవే దినచర్యగా మారిపోతుంది. ఇక అప్పుడప్పుడు కొన్ని చిలిపి పనులు కూడా చేస్తూ చివరకు దొరికిపోయి తల్లిదండ్రులతో చీవాట్లు తినడం కూడా ఓ మధురానుభూతియే. అలా సమ్మర్ హాలీడేస్‌ను జాలీగా ఎంజాయ్ చేస్తూ ఓ చిలిపి పని చేసిన ఓ చిన్నారికి అనుకోని సంఘటన ఎదురైంది. ఇంతకీ ఏం జరిగిందంటే..?
జోగులాంబ గద్వాల జిల్లాలోని మల్దకల్ మండలంలోని విఠలాపురం గ్రామానికి చెందిన ఓ చిన్నారి ఆడుకుంటూ గ్రామ సమీపంలోని చీనీ (బత్తాయి)తోటలోకి వెళ్లింది. అక్కడ బత్తాయిలను చూసిన ఆ చిన్నారి సరదా కోసం వాటిని కోసింది. అక్కడే కాపలాగా ఉన్న ఆ తోట యజమాని భార్య ఇది గమనించింది. వెంటనే ఆ చిన్నారి వద్దకు వెళ్లి మందలించింది. అంతటితో ఆగకుండా ఆ పాపను గొలుసులతో కట్టేసి కొట్టింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ ఘటనపై స్పందిస్తూ ఆ తోట యజమాని.. ఆ చిన్నారి చాలాసార్లు తమ తోటలోకి వచ్చి బత్తాయి కాయలు కోసుకుని వెళ్లిందని.. ఆ పాపకు మతిస్థిమితం సరిగ్గా లేదని అన్నారు. ఆమెను భయపెట్టేందుకే తన భార్య గొలుసుతో కట్టేసిందని.. అంతే కానీ ఆమెను కొట్టలేదని స్పష్టం చేశారు.