శ్రీనివాస్ గౌడ్‌పై టూరిజం ఫర్నీచర్ తరలింపు వివాదం, ఆందోళనకు దిగిన ఓయూ విద్యార్థులు - మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఆఫీస్ వద్ద ఆందోళన
🎬 Watch Now: Feature Video
Published : Dec 6, 2023, 5:08 PM IST
OU Students Block Ex Minister Srinivas Goud Office Furniture : రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కార్యాలయంలోని ఫర్నిచర్‌ను అక్రమంగా తరలిస్తుండగా ఓయూ విద్యార్థి సంఘం నాయకులు అడ్డుకున్నారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలోని శ్రీనివాస్ గౌడ్ ఆఫీసులోని కంప్యూటర్లు, ఫర్నిచర్, పలు దస్త్రాలను ఓ వాహనంలో తరలిస్తున్నారు. ఈ క్రమంలో విషయం తెలుసుకున్న ఓయూ విద్యార్థి నాయకులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ప్రభుత్వ వస్తువులను మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అనుచరులు అక్రమంగా తరలిస్తున్నారంటూ విద్యార్థి సంఘా నేతలు ఆందోళనకు దిగారు.
అనంతరం సైఫాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఓయూ విద్యార్థి సంఘం నాయకుడు మాట్లాడారు. ప్రభుత్వ కార్యాలయానికి సంబంధించిన సామగ్రిని అక్రమంగా మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తరలించే ప్రయత్నం చేస్తున్నారని విద్యార్థి సంఘం నాయకుడు ఆరోపించారు. రాష్ట్రంలో నాయకులు ఇతర ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా సామగ్రిని తరలించే ప్రయత్నం చేస్తున్నారేమోనని ఆందోళన వ్యక్తం చేశారు.