నల్గొండ మున్సిపాలిటీని కోల్పోయిన బీఆర్ఎస్ - అవిశ్వాస తీర్మానంలో నెగ్గిన కాంగ్రెస్ - BRS Municipal Chairman
🎬 Watch Now: Feature Video
Published : Jan 8, 2024, 6:49 PM IST
No Confidence Motion in Nalgonda : నల్గొండ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ అవిశ్వాస తీర్మానంతో హస్తగతం చేసుకుంది. బీఆర్ఎస్ పార్టీకి చెందిన మున్సిపల్ ఛైర్మన్ మందాడి సైదిరెడ్డికి వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. ఇవాళ జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయంలో జరిగిన అవిశ్వాస తీర్మానం ఓటింగ్లో కాంగ్రెస్ పార్టీకి 41 మంది అనుకూలంగా ఓటు వేయగా, బీఆర్ఎస్కు ఐదుగురు మాత్రమే ఓటు వేశారు. ఫలితంగా బీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ ఛైర్మన్ పీఠాన్ని కోల్పోయింది.
No Confidence Motion on BRS Municipal Chairman : అవిశ్వాస తీర్మానం ఓటింగ్లో 8వ వార్డు కౌన్సిలర్ పిల్లి రామరాజు యాదవ్ తటస్థంగా ఉండగా, బీజేపీకి చెందిన ఓ కౌన్సిలర్ గైర్హాజరయ్యారు. నల్గొండ మున్సిపల్లో మొత్తం 48 వార్డులకు గాను కాంగ్రెస్ 19, బీఆర్ఎస్ 21, బీజేపీ 6, ఎంఐఎం 1, స్వతంత్ర అభ్యర్థి 1 గెలిచినా విషయం తెలిసిందే. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల ముందు బీఆర్ఎస్ నుంచి పలువురు కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీలోకి చేరారు.