Nizamabad Resident Died In Car Incident At America : అమెరికాలో అంత్యక్రియలు.. నిజామాబాద్‌లో ప్రత్యక్ష ప్రసారం - అమెరికాలో శైలేష్ అనే నిజామాబాద్ వాసి మృతి
🎬 Watch Now: Feature Video
Funeral In America According To Live In Nizamabad : అమెరికాలో చనిపోయిన రాష్ట్రానికి చెందిన ఒక వ్యక్తి అంత్యక్రియలను ప్రత్యక్ష ప్రసారం చేశారు. నిజామాబాద్ జిల్లా భీంగల్ మండలం బడా భీంగల్‌కు చెందిన గుర్రపు శైలేష్ న్యూజెర్సీలో జూన్ 3వ తేదీన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. కారులో మంటలు వ్యాపించడంతో.. అతను బయటకు రావడానికి కూడా వీలు లేకుండా ఉండడంతో అందులోనే సజీవ దహనం అయ్యాడు. దీనితో మృతదేహాన్ని స్వదేశానికి తరలించడానికి వీలులేక.. అమెరికాలోనే అంత్యక్రియలు నిర్వహించారు.
ఈ కార్యక్రమాన్ని బడా భీంగల్‌లో ఉన్న కుటుంబసభ్యులకు.. గ్రామస్తులకు ప్రత్యక్షప్రసారం ద్వారా చూపించారు. రాత్రి 10.30 గంటలకు అంత్యక్రియలు ప్రారంభమయ్యాయి. ఆ ప్రత్యక్ష ప్రసారం చూస్తున్న కుటుంబ సభ్యులు, గ్రామస్తులు విలపించారు. కనీసం కుమారుడి చివరి చూపు కూడా తల్లిదండ్రులు నోచుకోలేదు. వారు ఇలా అంత్యక్రియలను చూడడాన్ని జీర్ణించుకోలేకపోయారు. దీనితో వారి కన్నీటిని ఆపడం ఎవరితరం కాలేదు. అక్కడ ఉన్న చిన్నారుల నుంచి పెద్దవారు వరకు అందరూ కన్నీటిపర్యంతమయ్యారు.