NMC Commissioner Interview : 'పారదర్శక సేవలు అందించడమే లక్ష్యం.. అవినీతిని సహించేది లేదు' - makararadh ias

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jul 18, 2023, 5:11 PM IST

Nizamabad Municipal Corporation Commissioner Interview : నిజామాబాద్ నగర పాలక సంస్థ నూతన కమిషనర్‌గా యువ ఐఏఎస్ అధికారి మంద మకరంద్‌ బాధ్యతలు స్వీకరించారు. నగరంలోని నగర పాలక సంస్థ కార్యాలయంలో బాధ్యతలు చేపట్టిన మంద మకరంద్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అక్కడ ఉన్న సంబంధిత అధికారులను మున్సిపల్ కార్పొరేషన్​ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. గతంలో ట్రైనీ కలెక్టర్‌గా నిజామాబాద్‌ జిల్లాలో పని చేసిన ఆయనకు ఈ జిల్లాతో ఒక రకమైన బంధం ఉందని అన్నారు. జగిత్యాల జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌గా పని చేస్తూ బదిలీపై నిజామాబాద్ మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌గా వచ్చారు. నగరంలో ప్రధానంగా పారిశుద్ధ్యం, హరితహారంలపై ప్రత్యేక శ్రద్ధ చూపనున్నట్లు.. అదేవిధంగా ఇప్పుడున్న విపత్తు ఆధారిత వర్షాకాల కార్యాచరణ ప్రణాళిక సైతం సిద్ధంగా ఉన్నట్లు మకరంద్ వివరించారు. అవినీతిని సహించబోనని.. పరిపాలనను గాడిలో పెడతానని.. ప్రజలకు పారదర్శక సేవలు అందించేందుకు కృషి చేస్తానని అంటున్న నగర పాలక సంస్థ నూతన కమిషనర్‌ మంద మకరంద్‌తో ఈటీవీ భారత్ ముఖాముఖి.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.