'ఏదైనా సాధించాలనుకుంటే జీవితంలో కొన్ని త్యాగాలు చేయాల్సిందే' - నిఖత్ జరీన్ తాజా వార్తలు
🎬 Watch Now: Feature Video
మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ టైటిల్ గెలుచుకున్న తెలుగమ్మాయి నిఖత్ జరీన్. రానున్న ఒలింపిక్స్ లో పతకం సాధించటమే తన లక్ష్యమన్నారు. హైదరాబాద్ ఎఫ్‌సీసీలో మీడియాతో మాట్లాడిన నిఖత్ ... ప్రభుత్వంతో పాటు పలు ప్రైవేటు సంస్థలు సైతం సాయం చేస్తున్నాయని తెలిపారు. ఆడపిల్లలకు బాక్సింగ్ రక్షణ కోసం సైతం ఉపయోగపడుతుందన్న నిఖత్.. త్వరలో బాక్సింగ్ అకాడమీని ప్రారంభించాలనుకుంటున్నట్లు తెలిపారు.
"కొంత మంది స్పాన్సర్స్ నాకు చాలా సపోర్ట్ చేశారు. వెల్స్పన్, గోస్పోట్ ఫౌండేషన్లు నా బాక్సింగ్ ప్రయాణంలో ఎంతో సపోర్ట్ చేశారు. లాక్డౌన్ సమయంలో చాముండి సర్ ఆర్థికంగా ఎంతో సహాయం చేశారు. ఆయన నాకు 2లక్షల రూపాయలు ఇచ్చారు. అలాగే కాకినాడ సీపోర్ట్ నాకు ట్రైనింగ్ కోసం రూ.5లక్షలు ఆర్థిక సాయం చేశారు. నాట్కో కంపెనీ కూడా లాక్డౌన్ సమయంలో ఎంతో సహాయం చేసింది. నాకు ఎంతో సపోర్టు చేసినందుకు వారికి ఎప్పుడు కృతజ్ఞురాలిని. వారి సహకారంతోనే వెంట వెంటనే దేశం కోసం, రాష్ట్రం కోసం గోల్డ్ మెడల్ సాధించగలిగాను. హైదరాబాద్‌లో గ్రౌండ్ సౌకర్యాలు, పర్సనల్ కోచ్ లేకపోవడం వల్ల వేరే రాష్ట్రంలో ట్రైనింగ్ తీసుకున్నాను. ట్రైనింగ్ తీసుకుంటున్న సమయంలో మనం కుటుంబానికి దూరంగా ఉంటాము. వారిని మిస్ అవుతుంటాము. క్యాంప్‌లో మన స్నేహితులు తప్ప ఎవరూ ఉండరు.కొన్నిసార్లు ఒంటరి అనే ఫీలింగ్ వస్తుంది. కానీ నేను ఎప్పుడు ఒకటే అనుకునేదాన్ని నేను ఎందుకు ఇది ప్రారంభించాను. నా డ్రీమ్ ఏంటో నాకు తెలుసు.అవన్నీ గుర్తు చేసుకుని మరుసటి రోజు నుంచి మళ్లీ ట్రైనింగ్ ప్రారంభించేదాన్ని. ఇవన్నీ ఎదుర్కోవడానికి మనం మెంటల్‌గా స్ట్రాంగ్ ఉండాలి అని నమ్ముతాను. మనం జీవితంలో ఏదైనా సాధించాలంటే మనం కొంత త్యాగం చేయాల్సి ఉంటుంది. నా లక్ష్యాన్ని నేను సాధించాక తర్వాత మొత్తం కుటుంబంతో సంతోషంగా ఉంటాము."_నిఖత్ జరీన్