Naturopathy Day in Hayathnagar : 'ప్రకృతి వైద్యంతోనే.. మానవ మనుగడకు శ్రీరామరక్ష' - hayathnagar latest news
🎬 Watch Now: Feature Video
Published : Oct 15, 2023, 8:05 PM IST
Naturopathy Day in Hayathnagar : ప్రకృతికి, మనిషికి అవినాభావ సంబంధముందని.. ప్రకృతి వైద్యాన్ని పాటించినట్లయితే.. మానవులు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండొచ్చని.. గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ సంస్థల చైర్మన్ గున్న రాజేందర్‌రెడ్డి పేర్కొన్నారు. నేడు నేషనల్ నేచురోపతి డే (National Naturopathy Day) సందర్భంగా.. హయత్‌నగర్‌లోని గాంధేయన్ బీఈడీ కళాశాలలో జాతీయ ప్రకృతి వైద్య ఆరోగ్య సమ్మేళన సన్నాహక సమావేశం సమావేశం నిర్వహించారు.
ప్రకృతికి హాని చేయకుండా మనిషి జీవిస్తేనే.. మనుగడ ఉంటుందని పేర్కొన్నారు. ప్రకృతికి మనం ఏది ఇస్తే.. అది మనకు తిరిగి ఇస్తుందని పేర్కొన్నారు. నవంబర్ 18, 19 తేదీల్లో హైదరాబాద్‌లోని తెలుగు లలిత కళాతోరణంలో ప్రకృతి వైద్య సమ్మేళన సదస్సు.. నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రకృతి ప్రేమికులు, ఆరోగ్య శ్రేయోభిలాషులు, స్వచ్ఛంద సంస్థలు, ప్రకృతి ఆశ్రమ నిర్వాహకులు, గాంధేయవాదులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. అనంతరం డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాంకు నివాళులు అర్పించారు. అబ్దుల్ కలాం నిజమైన దేశభక్తుడని ఆయన జీవితాన్ని అందరూ ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.