కొండపోచమ్మ ప్రాజెక్టు నిలిపివేయాలంటూ నర్సాపూర్ రైతుల 'ప్రజా భవన్‌కు పాదయాత్ర'
🎬 Watch Now: Feature Video
Narsapur Farmers Hike to Praja Bhavan : కాళేశ్వరం, కొండ పోచమ్మ ప్రాజెక్టు పనులు వెంటనే ఆపి వేయాలని డిమాండ్ చేస్తూ నర్సాపూర్ నియోజకవర్గ రైతులు పాదయాత్ర చేపట్టారు. కాళేశ్వరం బాధితుల భూ సాధన కమిటీ ఆధ్వర్యంలో ఇవాళ నర్సాపూర్ జల హనుమాన్ నుంచి ప్రజా భవన్‌కు పాదయాత్ర చేపట్టిన రైతులు భూ సేకరణ నిలిపివేసి ప్రాజెక్టును పూర్తిగా రద్దు చేయాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడారు. ఈ ప్రాజెక్టు వల్ల బాధిత కుటుంబాలు నష్టపోతాయని ఆవేదన వ్యక్తం చేశారు.
Farmers Hike to stop kondaPochamma Project : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలిసి తమ సమస్యను వివరించి భూముల్ని కాపాడుకుంటామని రైతులు ధీమా వ్యక్తం చేశారు. కొండపోచమ్మ నుంచి సంగారెడ్డికి నిర్మించే కెనాల్‌ను నిర్మించవద్దని డిమాండ్ చేశారు. అత్యవసరమైతే నీటిని పైప్‌లైన్ ద్వారా తరలించాలని, ఓపెన్ కెనాల్ వద్దంటూ విన్నవించారు. కాలువ లేకున్నా పర్లేదని, దీని వల్ల భూములు కోల్పోతామని ఆవేదన వ్యక్తం చేశారు.
TAGGED:
రైతుల పాదయాత్ర