Nalla Pochamma Temple at Secretariat : సచివాలయ నల్లపోచమ్మ గుడి ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారు.. సీఎం కేసీఆర్ చేతుల మీదగా ప్రారంభం - తెలంగాణ వార్తలు

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : Aug 23, 2023, 12:29 PM IST

Nalla Pochamma Temple at Secretariat Telangana : సచివాలయంలోని నల్లపోచమ్మ అమ్మవారి ఆలయం ప్రారంభోత్సవం సందర్భంగా.. ఆలయ ప్రతిస్థాపనా క్రతువులు ప్రారంభమయ్యాయి. ఈ నెల 25 వ తేదీన ఆలయ ప్రారంభోత్సవ నేపథ్యంలో ఇవాళ్టి నుంచి మూడు మూడు రోజుల పాటు శాస్త్రోక్తంగా ప్రతిస్థాపన వేడుకలు జరగనున్నాయి. గణపతి పూజతో కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. రహదార్లు, భవనాల శాఖా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి దంపతులు, సచివాలయ సంఘం అధ్యక్షుడు నరేందర్ రావు దంపతులు పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 

Telangana Secretariat Nallapochamma Temple : రెండో రోజు స్థాపిత పూజ, ప్రతిష్ఠాపన హోమం, తిరుమంజసం, మహాలక్ష్మియాగం, ఫల పుష్పాదివాసం, మహా మంగళహారతి కార్యక్రమాలు నిర్వహిస్తారు. మూడో రోజైన 25వ తేదీన చండీయాగం, దిగ్బలి, ప్రాణప్రతిష్టాపన హోమం, ధ్వజస్థంభం, యంత్రప్రతిష్టాపన, విగ్రహాల ప్రతిష్ట, ప్రాణపతిష్ట, మూడు ఆలయాల శిఖర కుంభాభిషేకం, మహాపూర్ణాహుతి, మహా మంగళహారతి, మహాదాశీర్వచనం ఉంటాయి. 25వ తేదీ మధ్యాహ్నం జరగనున్న ప్రధాన పూజా కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొంటారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.