బైకును ఢీకొన్న టిప్పర్ లారీ - మంటలు చెలరేగి తండ్రీకుమారులు సజీవదహనం - father son died nagole
🎬 Watch Now: Feature Video
Published : Jan 5, 2024, 2:18 PM IST
Nagole Road accident Today : హైదరాబాద్లో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నాగోల్లో జరిగిన ప్రమాదంలో తండ్రీకుమారుడు మృతి చెందారు. తెల్లవారుజామున 5 గంటల సమయంలో ద్విచక్ర వాహనాన్ని టిప్పర్ ఢీ కొట్టింది. ఈ ఘటనలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న తండ్రి, కుమారుడు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు కుత్బుల్లాపూర్ చెందిన తండ్రి కుమార్ (40), కుమారుడు ప్రదీప్ (8)గా పోలీసులు గుర్తించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం : నాగోల్లో ఇవాళ తెల్లవారుజామున 5 గంటల సమయంలో టిప్పర్ లారీ బైకును ఢీ కొట్టింది. ఈ ఘటనలో మంటలు చెలరేగి ద్విచక్రవాహనం పూర్తిగా దగ్ధమవ్వడంతో పాటు వాహనంపై వెళ్తున్న తండ్రీకుమారులు సజీవదహనమయ్యారు. మరోవైపు టిప్పర్ లారీ కూడా దగ్ధమైంది. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. టిప్పర్ డ్రైవర పరారీలో ఉన్నట్లు తెలిపారు. కేసు నమోదు చేసిన వారు దర్యాప్తు చేపట్టారు. విషయం తెలుసుకున్న మృతుని కుటుంబ సభ్యులు ఆసుపత్రికి చేరుకుని కన్నీటి పర్యంతం అయ్యారు. తండ్రీకుమారుడి మరణం ఆ కుటుంబంలో తీరని విషాదాన్ని మిగిల్చింది.