Nagam Janardhan Reddy Latest News : నేను కాంగ్రెస్‌లోనే ఉన్నాను : నాగం జనార్దన్ రెడ్డి - నాగం జనార్దన్ రెడ్డి ప్రెస్‌మీట్
🎬 Watch Now: Feature Video
Nagam Janardhan Reddy Latest News : మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడుతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్‌లోనే ఉన్నానని, పార్టీలోనే ఉంటూ కేసీఆర్ అవినీతిపై ఉద్యమిస్తారని స్ఫష్టం చేశారు. పార్టీలో సీనియర్‌గా అనుభవం లేకపోయినా.. రాష్ట్ర రాజకీయాల్లో ముఖ్య నేతల్లో తాను ఒకరినని పేర్కొన్నారు. సొమాజిగూడ ప్రెస్ క్లబ్లో తన అనుచరులతో కలిసి మీడియా ముందుకు వచ్చిన ఆయన.. కొల్లాపూర్, నాగర్‌కర్నూలు సీటు ఆశిస్తున్న జగదీశ్వర్ రావు స్థానికంగా తనపై దుష్ప్రచారం చేసుకుంటూ లబ్ధి పొందాలని చూడటం సరైన పద్ధతి కాదన్నారు. ఇప్పటి వరకు ఎమ్మెల్యే టికెట్‌కు దరఖాస్తు చేసుకోలేదని.. క్షేత్రస్థాయి కార్యకర్తలతో చర్చించాక స్పందిస్తానని నాగం వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని ఆయన ఆరోపించారు. ఆ ప్రాజెక్టులో సుమారు రూ.48 వేల కోట్లు పక్కదారికి మళ్లాయని వెల్లడించారు. ఈ ప్రాజెక్ట్‌లో జరిగిన అవినీతిపై కాగ్ రూపొందించిన నివేదిక ఆధారంగా.. ఏసీబీకి ఫిర్యాదు చేయనున్నట్లు నాగం జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు.