ఆస్తిపన్ను చెల్లించట్లేదని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి తాళం వేసిన మున్సిపల్ అధికారులు - రిజిస్ట్రార్ ఆఫీసుకు తాళం
🎬 Watch Now: Feature Video
Published : Jan 11, 2024, 2:47 PM IST
Municipal Officials Seized Government Office In Nirmal : అద్దె భవనంలో ఉన్న పభుత్వ కార్యాలయాన్ని మున్సిపల్ అధికారులు సీజ్ చేసిన సంఘటన నిర్మల్ జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. పట్టణంలో అద్దె భవనంలో ఉన్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ భవన యజమానికి ఆస్తి పన్ను బకాయిలపై మున్సిపల్ అధికారులు నోటీసులు పంపారు. నిర్మల్‌లో ఆస్తి పన్ను బకాయిల చెల్లింపుల్లో ఉదాసీనత వద్దని జిల్లా పాలనాధికారి ఆశీస్ సాంఘ్వాన్ ఇటీవల ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు పెద్ద మొత్తంలో బకాయిలు ఉన్న వారిపై మున్సిపల్ అధికారులు చర్యలకు ఉపక్రమించారు.
Government Office Seized In Nirmal : లక్షరూపాయలకు పైగా బకాయి ఉన్న యజమాని స్పందించక పోవడంతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ భవనానికి, భవనంలో ఉన్న వ్యాపార సముదాయాలకు సీజ్ చేశారు. దీంతో కార్యాలయం ఎదుట సబ్ రిజిస్ట్రార్, సిబ్బంది, వినియోగదారుల దాదాపు రెండు గంటల పాటు పడిగాపులు కాయాల్సి వచ్చింది. ప్రభుత్వ కార్యాలయంలో లావాదేవీలు నిలిచిపోతాయి. చివరకు మద్యాహ్నం 12 గంటలకు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ తాళాలు తెరిచారు.