MP Laxman on BJP Candidates List : ఏ క్షణమైనా తొలి జాబితా.. బీసీలకు 20కి పైగా సీట్ల కేటాయింపు : ఎంపీ లక్ష్మణ్ - తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2023
🎬 Watch Now: Feature Video
Published : Oct 21, 2023, 1:00 PM IST
MP Laxman on BJP Candidates List : బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు బీసీలను రాజకీయ బానిసలుగా చూస్తున్నాయని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ఆరోపించారు. వాళ్ల ఓట్లు కావాలి కానీ.. సీట్లు మాత్రం ఇవ్వరని దుయ్యబట్టారు. రాష్ట్రంలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో.. బీసీలకు భారతీయ జనతా పార్టీ పెద్ద పీట వేస్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రం నుంచి 50కి పైగా స్థానాల్లో అభ్యర్థుల ఎంపిక కసరత్తు పూర్తయ్యిందన్నారు.
BJP Candidates 2023 List : మూడు రాష్ట్రాల అభ్యర్థుల ఎంపికపై కేంద్ర ఎన్నికల కమిటీ చర్చించిందని తెలిపారు. ఏ క్షణంలోనైనా.. బీజేపీ తెలంగాణ అభ్యర్థుల తొలి జాబితా వెలువడుతుందని తెలిపారు. సీట్ల కేటాయింపులో మహిళలకు ప్రాధాన్యం ఇచ్చినట్లు లక్ష్మణ్ పేర్కొన్నారు. ఈ క్రమంలోనే మహిళా బిల్లు కోసం దిల్లీలో ధర్నా చేసిన కవిత.. తమ పార్టీలో వారికి సీట్లు ఇవ్వలేదని విమర్శించారు. మహిళల పట్ల బీఆర్ఎస్ పార్టీ.. మొసలి కన్నీరు కారుస్తోందని మండిపడ్డారు. అభ్యర్థుల ఎంపికలో బీజేపీ సామాజిక న్యాయం పాటిస్తోందని వివరించారు. మొదటి విడతలో బీసీలకు 20కి పైగా సీట్లు కేటాయించినట్లు పేర్కొన్నారు.